వేసవిలోనూ అల్లంటీ!

వేసవిలోనూ అల్లంటీ!

Posted May 5,2018 in Other.

Sowjanya T
40 Friends 171 Views
వేసవిలోనూ అల్లంటీ!

ఎండవేడిని తట్టుకోవడానికి శీతలపానీయాలు ఎక్కువగా తాగుతుంటాం. అయితే ఈ కాలంలో అప్పుడప్పుడూ కురిసే వర్షాల వల్ల జలుబూ, దగ్గు లాంటివి రాకుండా ఉండాలంటే ఈ కాలంలో అల్లం ఎక్కువగా తీసుకోవాలంటారు నిపుణులు.

* విటమిన్‌ సి, మెగ్నీషియం అధికంగా ఉండే అల్లం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు అన్నీఇన్నీ కావు. ఒకటిన్నర కప్పు నీటిలో కొద్దిగా అల్లం తరుగు, టీపొడి వేసి మరగబెట్టి, వడకట్టాలి.    తరువాత అందులో సరిపోయేంత తేనె, నిమ్మరసం కలపాలి. దీన్ని ఉదయాన్నే తాగితే జీర్ణవ్యవస్థ పనితీరు పెరుగుతుంది. అజీర్తి సమస్య కూడా ఉండదు. 
పాలతో చేసిన టీలో కూడా కాస్తంత అల్లం ముక్కను వేసి వడకట్టి తాగితే ఆ రోజంతా ఉత్సాహంగా అనిపిస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధశక్తిని పెంచుతాయి. అనారోగ్యాలు దరిచేరకుండా చేస్తాయి. 
అల్లంలో ఉండే విటమిన్లూ, ఖనిజాలూ, అమినోయాసిడ్లు రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తాయి. శరీరంలో కొవ్వు చేరుకోకుండా చేస్తాయి. దాంతో అధికబరువు సమస్య అదుపులో ఉంటుంది. హృద్రోగాలు రాకుండా ఉంటాయి. 
* మహిళలకు నెలసరి సక్రమంగా వచ్చేలా చేస్తుంది అల్లం. అలాగే ఆ సమయంలో వచ్చే నొప్పిని కూడా అరికట్టగలిగే గుణం అల్లంలో ఉంది. ఈ సమయంలో కప్పు అల్లం టీ తాగితే నెలసరి సజావుగా సాగుతుంది. అల్లం చెడుకొలెస్ట్రాల్‌ని కూడా తగ్గిస్తుంది.