పుదీనాతో అజీర్తి దూరం

పుదీనాతో అజీర్తి దూరం

Posted May 5,2018 in Other.

Sowjanya T
40 Friends 144 Views
పుదీనాతో అజీర్తి దూరం

పుదీనాలోని ఔషధగుణాలు ఆరోగ్యానికి చేసే మేలు అంతాఇంతా కాదు. అందుకే దాన్ని ఎప్పుడో ఒకప్పుడు కాకుండా తరచూ వాడటం మంచిది. 
* పుదీనాలో క్యాల్షియం, ఫాస్ఫరస్‌ మూలకాలూ, సి, డి, ఇ, బి విటమిన్లు ఉంటాయి. ఇవన్నీ రోగనిరోధకశక్తిని అందిస్తాయి. అనారోగ్యాలు దరిచేరవు. 
* పుదీనాను తరచూ మన ఆహారంలో తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, వికారం వంటి సమస్యలు తగ్గుతాయి.     వికారంగా ఉన్నప్పుడు కప్పు పుదీనా టీ తాగి చూడండి. వెంటనే ఉపశమనం లభిస్తుంది. 
* శ్వాస సంబంధ సమస్యలకు కూడా చక్కటి ఔషధంలా పనిచేస్తుంది. జలుబూ, గొంతునొప్పి లాంటివాటిని వెంటనే తగ్గిస్తుంది. ఒక గిన్నెలో వేడినీటిని తీసుకుని దాంట్లో కొన్ని చుక్కల పుదీనా నూనె వేసి ఆవిరి పట్టుకున్నా ఉపశమనం లభిస్తుంది. 
* పుదీనా అలర్జీ, ఉబ్బసాన్ని కూడా తగ్గిసుంది. అందుకే దీన్ని తరచూ కూరల్లో, పచ్చడి రూపంలో తీసుకోవాలి. 
* పుదీనా ఆకుల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తరచూ నమలడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది. అంతేకాదు నోటిలోని హానికర బ్యాక్టీరియా కూడా నశిస్తుంది. కాబట్టి వంటకం రూపంలోనే కాదు తరచూ తినేలా చూసుకోవాలి.