సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే గుర్తింపు రద్దు

హైదరాబాద్‌: వేసవి సెలవుల్లో తరగతులు, అడ్మిషన్లు నిర్వహించే కళాశాలల గుర్తింపును రద్దు చేస్తామని తెలంగాణ ఇం

Posted April 4,2018 in News and Politics.

Nalinakshi nalini
71 Friends 69 Views
సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే గుర్తింపు రద్దు
హైదరాబాద్‌: వేసవి సెలవుల్లో తరగతులు, అడ్మిషన్లు నిర్వహించే కళాశాలల గుర్తింపును రద్దు చేస్తామని తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు హెచ్చరించింది. ఇప్పటికే విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తూ 396 కాలేజీలపై చర్యలు తీసుకున్నామని బోర్డు కార్యదర్శి అశోక్ చెప్పారు. జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల కోసం మే 21న ప్రకటన జారీ చేస్తామని, అప్పటి వరకు అడ్మిషన్లు తీసుకుంటే చెల్లవని స్పష్టం చేశారు. హాస్టళ్లకు కూడా ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాల్సిందేనని తెలిపారు. గుర్తింపు ఉన్న కళాశాలలు, అనుమతి ఉన్న హాస్టళ్లలోనే పిల్లలను చేర్చించాలని తల్లిదండ్రులను కోరారు.