పేటీఎం నుంచి ఆఫ్‌లైన్‌ పేమెంట్స్‌

ప్రముఖ మొబైల్‌ పేమెంట్స్‌ సర్వీసెస్‌ యాప్‌ పేటీఎం ఆఫ్‌లైన్‌ పేమెంట్‌ను ప్రవేశపెట్టింది. ‘టాప్‌ కార్డ్‌’

Posted April 4,2018 in Other.

Nalinakshi nalini
71 Friends 204 Views
పేటీఎం నుంచి ఆఫ్‌లైన్‌ పేమెంట్స్‌

దిల్లీ: ప్రముఖ మొబైల్‌ పేమెంట్స్‌ సర్వీసెస్‌ యాప్‌ పేటీఎం ఆఫ్‌లైన్‌ పేమెంట్‌ను ప్రవేశపెట్టింది. ‘టాప్‌ కార్డ్‌’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ ఆప్షన్‌తో క్షణాల్లో డబ్బు బదిలీ చేసుకోవచ్చు. దేశంలో ఇది మొదటి ఆఫ్‌లైన్‌ పేమెంట్స్‌ సొల్యూషన్‌. ఈ టాప్ కార్డ్‌ ఎన్‌ఎఫ్‌సీ(నియర్‌ ఫీల్డ్‌ కమ్యూనికేషన్‌) ఉపయోగించుకుని కంపెనీ గుర్తించిన పాయింట్‌ ఆఫ్‌ సేల్‌(పీఓఎస్‌) టర్మినల్‌కు నగదు బదిలీ చేస్తుంది. ఇంటర్నెట్‌ సదుపాయం లేకుండా ఈ బదిలీ చేయొచ్చు. కేవలం సెకను కాల వ్యవధిలో పేటీఎం టాప్‌ కార్డు ద్వారా సురక్షితమైన ఆఫ్‌లైన్‌ పేమెంట్స్‌ చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది.

టాప్‌ కార్డ్‌ నుంచి పేమెంట్స్‌ చేయడానికి వినియోగదారులు టాప్‌ కార్డ్‌పై ఉన్న క్యూఆర్ కోడ్‌ స్కాన్‌ చేయడం ద్వారా పేటీఎం ఖాతా నుంచి అందులోకి డబ్బు జమ చేసుకోవచ్చు. ఆ కార్డు ద్వారా సులభంగా చెల్లించవచ్చు. ఈ తరహా ఆఫ్‌లైన్‌ పేమెంట్స్‌ కోసం పేటీఎం వివిధ ఈవెంట్లు, విద్యా సంస్థలు, కార్పొరేట్స్‌ తదితర వాటితో భాగస్వామ్యం కుదర్చుకుంటోంది. దీని వల్ల వినియోగదారులు చాలా సులభంగా టాప్‌ కార్డు ద్వారా మర్చెంట్‌ టెర్మినల్‌ వద్ద డబ్బు బదిలీ చేయొచ్చు. ఫోన్‌ లేకపోయినా కూడా డబ్బు చెల్లించవచ్చు. చాలా మంది ప్రజలు ఇంకా ఇంటర్నెట్‌ వినియోగించలేకపోతున్నారు, అలాంటి వారికి డిజిటల్‌ లావాదేవీల సదుపాయం కల్పించేందుకు ఈ సదుపాయం ప్రవేశ పెట్టామని పేటీఎం సీఓఓ కిరణ్‌ వాసిరెడ్డి అన్నారు.