బ్యాగుతోనూ భయపెట్టొచ్చు

చదువూ, ఉద్యోగంలో భాగంగా రాత్రుళ్లు ఒంటరిగా ప్రయాణించడం... ఈ రోజుల్లో చాలామంది మహిళలకు మామూలే. అయితే అలా ప్రయ

Posted April 4,2018 in Other.

Nalinakshi nalini
71 Friends 179 Views
బ్యాగుతోనూ భయపెట్టొచ్చు

ఆత్మరక్షణలో భాగంగా మిమ్మల్ని మీరు ధృడంగా ఉంచుకోవాలి. దీని కోసం మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకోవాల్సిన అవసరంలేదు. అపరిచితుల నుంచి కాపాడుకునేందుకు చిన్నచిన్న కిటుకులు తెలిసుండాలి. మన హ్యాండుబ్యాగూ, గొడుగూ, పెన్నూ, తాళంచెవులూ, మంచినీళ్లసీసా... ఇవన్నీ అత్యవసర సమయంలో ఆయుధాలుగా ఉపయోగపడతాయని మరవకూడదు. 
* నడుస్తూ వెళ్తున్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని వెంబడిస్తున్నారనే సందేహం కలిగితే.. వెంటనే దగ్గర్లోని ఏటీఎంలోకి వెళ్లండి. అక్కడి సెక్యూరిటీకి మీ పరిస్థితిని వివరించి సాయం తీసుకోవచ్చు. 
* ఇప్పుడు ఆత్మరక్షణకు సంబంధించిన రకరకాల యాప్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిని మీ ఫోనులో పెట్టుకుంటే అవసరం అనుకున్నప్పుడు ఉపయోగించుకోవచ్చు. వాటిల్లో పోలీసులు రూపొందించినవీ ఉన్నాయి కాబట్టి సాయం కోరొచ్చు. 
* ఒకవేళ ఆటోలో లేదా క్యాబ్‌లో ప్రయాణిస్తోంటే... ఆ వాహనం వివరాల్ని మీ కుటుంబసభ్యులకు ఎక్కేముందే ఎస్సెమ్మెస్‌ చేయాలి. అలాగే ట్రాకింగ్‌ కూడా పెట్టుకుంటే.. మీరు ఎంతసేపట్లో ఇల్లు చేరతారనే విషయం వాళ్లకు అర్థమవుతుంది. తరచూ వాళ్లతో మాట్లాడుతుండటం కూడా మంచిది.